calender_icon.png 23 October, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీపీజీఎల్ లండన్ రాయల్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ

22-10-2025 11:06:33 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(Telangana Premier Golf League-2025) సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కానున్న సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా లీగ్ లోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన లండన్ రాయల్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. యూకేలో వ్యాపారవేత్తగా ఉన్న శ్రీనివాస్ బిక్కిన ఈ ఫ్రాంచైజీతో తొలిసారి గోల్ఫ్ లోకి అడుగుపెట్టారు.బిక్కిన స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో లండన్ రాయల్స్ టీమ్ ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం భారత్ లో గోల్ఫ్ కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ లో ఫ్రాంచైజీ కొనుగోలు చేసినట్టు శ్రీనివాస్ బిక్కిన చెబుతున్నారు.

గోల్ఫ్ క్రీడపై తనకున్న అభిరుచితో బెస్ట్ ప్లేయర్స్ ను ఆక్షన్ లో దక్కించుకున్నట్టు వెల్లడించారు. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఎంటర్ టైన్ మెంట్ మూడు కలిసి ఒకే వేదికలో ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలో బిక్కిన స్పోర్ట్స్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ గోల్ఫ్ లోకి అడుగుపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ గోల్ఫర్లతో బరిలోకి దిగుతున్న తమ లండన్ రాయల్స్ టీమ్ టీపీజీఎల్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

లండన్ రాయల్స్ టీమ్ ప్లేయర్స్:

డా. సమీర్ మహీంద్రా(కెప్టెన్), మనోజ్ చవాడ, వివేక్ వర్మ, రవికుమార్ ఎర్రా, బస్వా వీరన్, బాబూ మోహన్ సింగ్, టీ వీ సుబ్బారావు, డీవీఎస్ జయకృష్ణ, ప్రవీణ్ బహెటి, రాజేష్ ఉడుప, అనిల్ రెడ్డి కె , శ్రీనివాస్ బిక్కిన