calender_icon.png 23 October, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ అభివృద్ధి దిశగా చర్యలు

22-10-2025 10:53:04 PM

జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి తెలిపారు. బుధవారం కెరమరి మండల కగోయగం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇందాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించి రిజిస్టర్లు, వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాధికారి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో త్రాగునీరు, విద్యుత్, మూతశాలలు, ప్రహరీ గోడ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదిత-రులు పాల్గొన్నారు.