17-11-2025 05:41:32 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూరు మండలంలో దేవాంగ సంఘం ఆధ్వర్యంలో వన భోజన కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. అడవి ప్రాంతంలోని మాణిక దేవార వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు సంప్రదాయ పూజలు నిర్వహించి... అనంతరం అన్నసమారాధనలో పాల్గొన్నారు. సంఘ గౌరవ అధ్యక్షులు బెనికి శ్యామ్ సుందర్, అధ్యక్షులు పొలాస శేఖర్ మాట్లాడుతూ సంఘ ఐక్యత, సాంప్రదాయాల పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు. సభ్యులందరి సహకారంతో కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు.