calender_icon.png 17 November, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొగమంచులో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి

17-11-2025 07:48:33 PM

వెంకటాపూర్ ఎస్సై చల్లా రాజు

వెంకటాపూర్/రామప్ప (విజయక్రాంతి): మండలంలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరిగి ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఈ కారణంగా రహదారులపై విజిబిలిటీ తగ్గిపోవడంతో ప్రయాణికులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వెంకటాపూర్ ఎస్సై చల్లా రాజు సూచించారు. వాహనదారులు ఎవ్వరూ రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేయకూడదని, వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా పార్కింగ్ లైట్లు ఆన్ చేసి ఉండాలని, పరిమితికి మించి వేగంతో ప్రయాణించడం మానుకోవాలని, అదేవిధంగా ఉదయం రామప్ప దేవాలయానికి భక్తులు వేకువజామునే చేరుకునే అవకాశం ఉన్నందున వారు కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకుని, నిదానంగా ప్రయాణించి, ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, భద్రతా నియమాలను పాటించి, సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.