14-03-2025 12:23:08 AM
సిర్పూర్,(విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసిగూడలో కామ దహనం కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. వారి ఆచారం ప్రకారం ఇంటి కో ఎండు కుడుక ,ఉల్లి మొక్కలు చక్కెర పేర్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెదురు బొంగులను వేలాడదీసి కామ దాహనం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతం తో పాటు జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి కామ దహన వేడుకలను నిర్వహించారు. శుక్రవారం రోజు హోలీ పండుగ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాలలో గ్రామ పటేళ్లు, దేవరిల్ల పాటు చిన్న పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.