10-09-2025 05:35:55 PM
నూతన చైర్మన్ గా గెడం కేశవ్ ఎన్నిక..
అదిలాబాద్ (విజయక్రాంతి): వామపక్ష విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బుధవారం వామపక్ష విద్యార్థి సంఘాల సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నూతన చైర్మన్ గా గెడం కేశవ్, వైస్ చైర్మన్ గా సలాం వరుణ్, సమన్వయకర్తగా మడావి గణేష్, కోశాధికారిగా ఆత్రం నగేష్, కో కన్వీనర్లుగా సిడం సాయి, కోట్నాక్ సక్కు లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన చైర్మన్ గెడం కేశవ్ మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. అనుమతి లేని కోచింగ్ సెంటర్లను, పాఠశాలలను మూసివేయలని, ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ డిమాండ్ల సాధనకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో భవిష్యత్ కార్యక్రమం రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.