10-09-2025 05:38:19 PM
అశ్వాపురం (విజయక్రాంతి): ఎన్ఎఫ్సిఎం కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ ఈ నెల 13వ తేది వరకు కొనసాగనున్నట్లు అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి(CI Ashok Reddy) బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు రాజీ పడదగిన కేసులు పరిష్కరించుకోవచ్చని, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పెట్టీ కేసులు ఉన్నవారు హాజరై తక్కువ ఫైన్‌తో కేసులు ముగించుకోవచ్చని పేర్కొన్నారు. ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నందున, ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.