calender_icon.png 15 May, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో సౌదీ భారీ పెట్టుబడి

14-05-2025 12:00:00 AM

142 బిలియన్ అమెరికన్ డాలర్లతో ఆయుధ ఒప్పందం

రియాద్, మే 13: అమెరికా అధ్యక్షుడు ట్రంప్  పశ్చిమాసియా పర్యటనలో భాగం గా మంగళవారం సౌదీ యువరాజు మహ్మ ద్ బిన్ సల్మాన్‌తో చర్చలు జరిపారు. సౌదీ తర్వాత యూఏఈ, ఖతార్ దేశాల్లో కూడా ఆయన పర్యటన కొనసాగనుంది. అమెరికా, సౌదీ మధ్య పలు ఒప్పందాలు కుదిరినట్టు సౌదీ దేశ టెలివిజన్ పేర్కొంది.

సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్-ట్రంప్ మధ్య ఇంధ నం, రక్షణ, మైనింగ్ తదితర విషయాలపై చర్చలు జరిగాయి. అమెరికాలో సౌదీ అరేబి యా 600 అమెరికన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు వైట్ హౌస్ ప్రకటించిం ది.

చరిత్రలో లేని విధంగా ఈ రెండు దేశాల నడుమ 142 బిలియన్ అమెరికన్ డాలర్ల యుద్ధ పరికరాల కొనుగోలు ఒప్పందం కు దిరింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణమంత్రి పీట్ హెగ్సెత్, వాణిజ్యమంత్రి హోవర్ట్ లుట్నిక్, ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ ఉన్నారు. 

ఖరీదైన కానుక.. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఖతార్ రాజకుటుంబం అత్యంత విలువైన బోయిం గ్ 737 విమానం బహుమతిగా అందించిం ది. ఈ విలాసవంతమైన విమానం విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు. ఇంత భారీ బహుమతిని వదులుకోవడం మూర్ఖ పు చర్యే అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఆ విమానాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోనని తేల్చిచెప్పారు.