12-10-2025 03:17:48 AM
మణికొండ, అక్టోబర్ 11: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ వార్డు మాజీ కార్పొరేటర్ బూరుగు శ్రీనాథ్‌రెడ్డిని నార్సింగి పోలీసులు శనివారం అరెస్ట్ చేశా రు. ఓ ఇంటి యజమానిని బెదిరించి డబ్బు లు వసూలు చేసిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. హైదర్ షాకోట్ పరిధి లో ఓ వ్యక్తి 100 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా సెల్లార్ తవ్వకాలు చేపట్టాడు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకున్న మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి, యజమానిని బెదిరించడం మొదలుపెట్టాడు.
అక్రమ నిర్మాణం విషయాన్ని బయ టపెడతానని, అధికారులతో చెప్పి కూల్చివేయిస్తానని భయపెట్టాడు. ఈ వ్యవహారం బయటకు రాకుండా ఉండాలంటే తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భయపడిపోయిన బాధితుడు, ముందుగా 5 లక్షల రూపాయలు చెల్లించాడు. అయినా శ్రీనాథ్‌రెడ్డి వేధింపులు ఆపలేదు. మిగిలిన రూ.5 లక్షలు కూడా ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచాడు. బెదిరింపులు ఎక్కువవడంతో బాధితుడు నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.