10-07-2025 07:11:19 PM
పుస్తకావిష్కరణ సభలో మాజీ మత్స్య శాఖ ఫెడరేషన్ ఛైర్మెన్ పిట్టల రవీందర్ ముదిరాజ్ పిలువు..
కామారెడ్డి (విజయక్రాంతి): మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కావాలని రాష్ట్ర మత్స్యసహకార సంఘాల సమాఖ్య(Fisheries Federation) మాజీ చైర్మెన్, తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్ ముదిరాజ్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మత్స్యకార సంఘాల, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బట్టు విట్టల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ మత్స్యరంగం- సమగ్ర అభివృద్ధి- కీలక అంశాలు అనే పుస్తకాన్ని స్థానిక మత్స్యకారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ పుస్తకం తెలంగాణ మత్స్య రంగా సమగ్ర అభివృద్ధికి ఒక దిక్సూచి లాంటిదని అన్నారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ మచ్చరంగంలో అపారమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వీటిని అందిపుచ్చుకొని సాంప్రదాయ మత్స్యకారులు లక్షాధికారులుగా మారేందుకు ఈ పుస్తక దోహదపడుతుందని అన్నారు. కేవలం నీటి వనరుల అభివృద్ధి చేపల ఉత్పత్తిలో పెరుగుదల, ప్రభుత్వ పథకాల అమలుతో మాత్రమే మచ్చరంగ మహువృద్ది చెందినట్లు కాదని తరతరాలుగా అన్ని రంగాల్లో ఎంతో వెంటపడిపోయిన సాంప్రదాయం మత్స్యకారుల కుటుంబాలు ఆధునిక ప్రపంచంలో సమ భాగస్వాములు అయినప్పుడు మాత్రమే మచ్చరంగం సమగ్రంగా అభివృద్ధి చెందినట్లుగా భావించాలని అన్నారు. గత ప్రభుత్వ పాలనాకాలంలో తెలంగాణ మచ్చరంగం అభివృద్ధికి కొంత మేరకు ప్రయత్నాలు జరిగినప్పటికీ మత్స్య శాఖలో పేరుకుపోయిన అవినీతి, ఎలక్షన్ ఆధునిక విధానాల పట్ల అవగాహన లేకపోవడం అలాంటి అనేక కారణాల వల్ల ఆశించిన ఫలితాలు దక్కలేదని తెలిపారు.
మత్స్యరంగం అభివృద్ధి కోసం అప్పటి ప్రభుత్వం కోట్లాది రూపాయలను పథకాల పేరిట ఖర్చు చేసినప్పటికీ అధికారులు అవినీతి, మత్స్యకారుల అవగాహన రాయిత్యం తదితర కారణాల వల్ల మత్స్యకారుల జీవితాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలం తర్వాత మత్స్యశాఖకు ప్రత్యేకంగా మంత్రి నియమించడం, ఆ రంగ అభివృద్ధి విషయంలో ఆలోచించడం శుభ పరిణామం అనీ, ఈ రంగాన్ని దురదగాతిన అభివృద్ధి చేసే ఆచరణ కార్యక్రమాలు ప్రవేశపెట్టాలని వారు కోరారు. కొత్తగా మత్స్య శాఖకు మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీహరి మత్స్యకార కులాల ప్రతినిధిగా రావడం అర్శించదగిన విషయమని అన్నారు.
కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు డాక్టర్ నిజ్జన రమేశ్ ముదిరాజ్, సాయిబాబా ముదిరాజ్, బాలయ్య ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, పోతాయిపల్లి బాలయ్య ముదిరాజ్, నారాయణ ముదిరాజ్, పోల్కంపేట రవి ముదిరాజ్, లక్ష్మినారాయణ ముదిరాజ్, వివిధ గ్రామ, మండలాల మత్స్య పారిశ్రమిక సహకార సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యలు తదితరులు పాల్గొన్నారు.