10-07-2025 07:08:13 PM
సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి..
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ సింగిల్ విండో సొసైటీలో నూతన సభ్యులుగా చేరడానికి అర్హత ఉన్న ప్రతి రైతుకు అవకాశం కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి(CPM Mandal Secretary Sirpangi Swamy) కోరారు. జిల్లా పరిధిలోని అనేక సింగిల్ విండో సొసైటీల్లో నూతన సభ్యుల నమోదు కోసం అవకాశం కల్పిస్తున్నారని వలిగొండ సింగిల్ విండో సొసైటీలో మాత్రం నూతన సభ్యుల నమోదుకు నేటికీ అవకాశం కల్పించడం లేదని కేవలం సొసైటీలో భూములను తాకట్టు పెట్టి మార్ట్ గేజ్ చేసుకున్న రైతులకు మాత్రమే సభ్యత్వం పొందే అవకాశం ప్రస్తుతం ఉందని అన్నారు. కానీ భూమి ఉండి సభ్యత్వం పొందేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలన్నారు. ఇప్పటికే అనేకమంది నూతన సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారని పెండింగ్ లో ఉన్న వారితో పాటు నూతన సభ్యుల నమోదు కోసం వెంటనే అవకాశం కల్పించేందుకు పాలకవర్గం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.