10-07-2025 07:15:18 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల(Valigonda Mandal) కేంద్రంలోని శ్రీ విద్యాపురంలో గల శ్రీ హరి హర త్రిశక్తి క్షేత్రంలో (మహాలక్ష్మి, మహా సరస్వతి, మహాకాళి) గురువారం గురుపౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టోత్తర శత శ్రీ సూక్త హోమం అదేవిధంగా శ్రీ దేవి, భూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి, పార్వతీ సమేత ఇష్టకామేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద సంస్కృతి పరిషత్ సభ్యులు మాట్లాడుతూ, ఆషాఢ పౌర్ణమిని గురుపౌర్ణమి, వ్యాసపౌర్ణమిగా జరుపుకుంటామని ఈరోజు మనకు మార్గనిర్దేశం చేసే పెద్దలను, గురువులుగా భావించి వారిని పూజిస్తామని, జ్ఞానప్రదాతలైన మేథా దక్షిణామూర్తి, లక్ష్మీ హయగ్రీవ స్వామి కి అభిషేకం, అష్టోత్తర శతనామార్చన నిర్వహించడం జరిగిందని తెలిపారు.