05-01-2026 12:08:39 AM
గోపాలపేట, జనవరి4 : గోపాలపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో యోజన క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీలను జిల్లా విద్యా శాఖ అధికారి అబ్దుల్ ఘని ప్రారంభించిన క్రీడలు ఆదివారం కూడా కొనసాగుతున్నాయి. క్రీడాకారుల మధ్య కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కోకో కబడి వాలీబాల్ ఫుట్బాల్ క్రీడలలో పోటీలను నిర్వహించడం జరుగుతుంది. పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు సోమవారం రోజు షీల్ లను బహూకరించడం జరుగుతుందని. వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్ రెడ్డి తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని గ్రామ సర్పంచ్ స్వప్న భాస్కర్ మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ మరియు డీఈవో ఆఫీస్ అధికారిక సిబ్బంది శేఖర్ ప్రతాప్ రెడ్డి మహానంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రంగస్వామి పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.