11-10-2025 05:37:30 PM
ఇల్లెందు, (విజయక్రాంతి): వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ సింగరేణి ఇల్లందు ఏరియా ఆధ్వర్యంలో నిర్వహించిన రీజినల్ స్థాయి (మణుగూరు, ఇల్లందు ఏరియా) కల్చరల్ మీట్ పోటీలను హానరరి సెక్రటరీ వరిపల్లి అజయ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కార్మికుల ఆరోగ్యము, మానసిక ఉల్లాసం కొరకు ప్రతి సంవత్సరం ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని అందులోని భాగంగా కల్చరల్ మీట్ ప్రోగ్రాం క్రీడలు రీజినల్ స్థాయి పోటీలు ఇల్లందులో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇందులో పాల్గొన్న ఉద్యోగులు వారి యొక్క కళలు, సంగీతం, నృత్యం, కవితా పఠనం, నాటికలు వంటి ప్రదర్శిచారు.
ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు కంపెనీ లెవెల్ ను, కోల్ ఇండియా స్థాయిలో తమ ప్రతిభను చాటి సింగరేణికి గోల్డ్ మెడల్ సాధించాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైజర్ జాన్ వెస్లీ, క్రీడల సమన్వయకర్త కల్వల వెంకటేశ్వర్లు, జనరల్ కెప్టెన్ దాట్ల శ్రీకాంత్, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.