calender_icon.png 11 October, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచుదాం

11-10-2025 05:28:57 PM

నిర్మల్ (విజయక్రాంతి): జన విజ్ఞాన వేదిక నిర్మల్ జిల్లా ప్లీనం స్థానిక తెలంగాణ బాలికల పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వెల్మల మధు హాజరై మాట్లాడుతూ నేడు అనూహ్యంగా కురుస్తున్న వర్షాలకు, క్లౌడ్ బర్స్ట్ కు కారణం అడవుల విధ్వంసం, అధిక శిలాజ ఇంధనాల వినియోగం అని తెలియజేశారు. ఈ సమావేశంలో వాతావరణ మార్పులు -వర్షాలు, క్లౌడ్ బర్స్ట్ అను అంశంపై ప్రసంగించారు.

నేడు మనిషి దురాశ, దుశ్చర్యల వలన నశించి పోతున్న అడవి, జీవ వైవిధ్యంను కాపాడటానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కవ్వాల్ టైగర్ జోన్ లాంటి అభయారణ్యాలను ఏర్పర్చవలిసిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని మానవ ఆవాస యోగ్యంగా కాపాడాలంటే ప్రతి ఒక్కరు ఇంటి ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటాలని, వ్యక్తిగత వాహానాలకు బదులు, సామాజిక రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని సూచించారు.