calender_icon.png 11 October, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేకే 5 ఓసీలో శ్రీ దుర్గా భవాని మాత ఆలయంలో సహపంక్తి భోజనాలు

11-10-2025 05:33:32 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జేకే 5 ఓసీలోని దుర్గా భవాని మాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రులలో భాగంగా మహాచండీ యాగ మహోత్సవాన్ని, సహపంక్తి భోజనాలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇల్లందు ఏరియా జి.యం. వి.కృష్ణయ్య ప్రారంభించారు. విశిష్ట అతిధిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. శ్రీ దుర్గా భవాని మాత ఆలయంలో మహాచండీ యాగ కార్యక్రమాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి జి.యం. వి.కృష్ణయ్య, మేనేజర్ పూర్ణ చందర్, ఇతర అధికారులు ఉద్యోగులు వారి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

తదుపరి మహా అన్న ప్రసాద వితరణ(సహపంక్తి భోజనాలు) కార్యాక్రమంలో ఏరియా అధికారులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏజియం ఐఈ డి గిరిధర్ రావు, డీజియం పర్సనల్ అజీర తుకారాం, రామూర్తి, శివ వీర కుమార్, సతీష్ కుమార్, ప్రాజెక్ట్ ఇంజనీర్ చిన్నయ్య, సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, సి.యం.ఓ.ఎ అధ్యక్షులు ఎ.జి. శివప్రసాద్, గుర్తింపు సంఘం డిప్యూటి జనరల్ సెక్రటరీ సారయ్య, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షులు జే.వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు ఉద్యోగులు, ఆలయకమిటి సభ్యులు పాల్గొన్నారు.