calender_icon.png 31 December, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీష్ రావు ఉత్తమ్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి

31-12-2025 08:54:44 PM

కోదాడ: మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిపై మాజీమంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఉమ్మడి నల్లగొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణ గోదావరి జిల్లాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అన్యాయం ఎక్కువని ఆయన అన్నారు.

ఏపీ ప్రతిపాదించిన పోలవరం బనక చర్ల ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందని బిఆర్ఎస్ నేత మాజీమంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించినాడు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరుతూ ఇప్పటికే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో నిరంతరం పోరాడే వ్యక్తి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అని ఆయన స్పష్టం చేశారు.. అటువంటి వ్యక్తిపై విమర్శలు తగవున్నారు.