05-05-2025 12:00:00 AM
పెన్ పహాడ్ : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం భక్తళాపురం గ్రామంకు చెందిన సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు గోపాల్దాస్ వీరయ్య (53) అస్వస్థకు గురై చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీశ్ రెడ్డి విచ్చేసి మృతుని వీరయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
వారి వెంట మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, మాజీ జడ్పీటీసీ మామిడి అనితా అంజయ్య, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, వివిధ పార్టీ నాయకులు దొంగరి యుగేందర్, నల్లపు రామ్మూర్తి, చింతం వెంకటేశ్వర్లు, నెమ్మాది ఉపేందర్, నెమ్మాది కృష్ణ, జుట్టుకొండ గణేష్, నీలాల సతీష్ తదితరులు ఉన్నారు.