calender_icon.png 5 May, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

05-05-2025 12:00:00 AM

యాదాద్రి భువనగిరి మే 4 ( విజయక్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి కొండపై వెలసిన స్వయంభూ, ప్రత్యక్ష దైవం శ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడా నికి ఆదివారం రోజు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు అయినందున శని ఆదివారాలలో భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి విచ్చేస్తున్నారు. క్యూలైన్లని బార్లు తీరి ఉన్నాయి. స్వామివారి దర్శనానికి  రెండు గంటలు సమయం పడుతుంది.

సెలవు దినాల నేపథ్యంలో ఈనెల మొత్తం భక్తుల సంఖ్య రోజుకు పెరిగే అవకాశాలున్న కారణంగా ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక దర్శనాలకు స్వయంగా హాజరయ్యే  ప్రోటోకాల్ విఐపి ప్రముఖులకు మాత్రమే పరిమితం చేయుచు, సాధారణ భక్తులకు సులభత రంగా త్వరితగతిన దర్శన సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు కార్యనిర్వాహణ అధికారి వెంకట్రావు తెలిపారు.