05-11-2025 03:51:32 PM
నకిరేకల్,(విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలైన చెరువుగట్టు శ్రీ పార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవాలయం, నకిరేకల్, వల్లాల, ఇనుపాములలోని శివాలయాలు నకిరేకలోని సాయిబాబా గుడి, గీతామందరితోపాటు వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడయి. పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయాల్లో వివిధ గ్రామాల్లో సత్యనారాయణ స్వామి ,కేతరానద్ నోములను, వ్రతాలు ను ఆచరించారు.