05-11-2025 03:54:19 PM
మునిపల్లి,(విజయక్రాంతి): మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా బుధవారం మాజీ ఎంపీపీ శైలజ శివశంకర్, వైస్ ఎంపీపీ బాబా పటేల్, మాజీ సర్పంచులు విశ్వనాథం, రమేష్, ప్రభు, శ్రీనివాస్, నాయకులు హైదరాబాద్ లోని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నివాసంలో తన్నీరు సత్యనారాయణ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.