05-11-2025 04:01:04 PM
శ్రీ షిరిడి సాయి ఆలయంలో కార్తీక పౌర్ణమి హారతి
విశేష సంఖ్యలో హాజరైన భక్తులు
మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని తమ్మి చెరువుకట్ట వీధిలో గల శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి పుణ్య తిథిని పురస్కరించుకొని బుధవారం ఉదయం ఉదయం 6 గంటలకు లోక కళ్యాణార్థం మన ఇంటి హారతి కార్యక్రమములో భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఆడపడుచులు తమ ఇంటి నుండి మంగళహారతి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. ఉదయం 6 నుండి 6-30 వరకు సామూహికంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది.
ఆలయ అర్చకులు రామడుగు సాయి శ్రీనివాస్ 45 నిమిషముల పాటు శేజ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హారతి కార్యక్రమం అనంతరం ఎవరి ఇంటికి వారు వేళ్ళాలని ఆయన అన్నారు. బాబా ఆలయంలో హారతి కార్యక్రమంలో పాల్గొంటే బాబా సంపూర్ణ కృపకు పాత్రులు అవుతారని ఆయన పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఆలయాల్లో దీపాలు వెలిగించడం మన సాంప్రదాయమని ఈ హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.