05-11-2025 04:19:57 PM
నకిరేకల్(విజయక్రాంతి): స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డివైఎఫ్ఐ రామన్నపేట మండల కార్యదర్శి మెట్టు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం.భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ 46 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని సిరిపురం గ్రామంలో డివైఎఫ్ఐ జెండా ఆవిష్కరణ గ్రామ శాఖ అధ్యక్షుడు సిలివేరు రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్రం ఉద్యమ స్ఫూర్తితో భగత్ సింగ్ లాంటి వీరుల ఆశల వారసత్వంతో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య 1980 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలోని లుతియానాలో డివైఎఫ్ఐ ఆవిర్భవించిదని ఆయన తెలిపారు.
'అందరికీ విద్య-అందరికీ ఉపాధి' అనే నినాదంతో దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహిస్తూ యువతను చైతన్యం చేస్తుందన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహిస్తుందన్నారు. ఒకవైపు పోరాటాలు చేస్తూనే మరోవైపు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. 'అవినీతి అంతం డివైఎఫ్ఐ పంతం' అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పోరాటాల నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి ఏళ్ల శ్రీకాంత్, వర్కాల రాజు, సిలివేరు రాజు, కూనూరు గణేష్, నరసింహ విజయ్, నవీన్, వేణు, కన్నా రెడ్డి, నవీన్, అనిల్, గణేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.