05-11-2025 03:57:51 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా, కన్నుల పండుగగా బుధవారం సుల్తానాబాద్ పట్టణంలో జరిగాయి. దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున ఉదయం 5 గంటల నుంచి దేవాలయాలకు పోటెత్తారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో దేవాలయాలు సందడిగా మారాయి. మహిళలు పెద్ద ఎత్తున శివలింగం, నందీశ్వర విగ్రహాల వద్ద, ఉసిరి చెట్టు వద్ద కార్తీక ఉసిరిక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రకాల నైవేద్యాలను సమర్పించారు.
సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం, శ్రీ సాంబశివ దేవాలయం, పాత బజార్లోని శ్రీ శివాలయం, గుడిమిట్టపల్లి శివాలయం, పెరిగిద్ద ఆంజనేయస్వామి దేవాలయం, వాసవి మాత దేవాలయం, శాస్త్రి నగర్ అభయ ఆంజనేయ స్వామి దేవాలయాల్లో అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్, పారువెల్ల రమేష్ శర్మ, సాయి ప్రణవ్, వల్ల కొండ మఠం మహేష్, రమేష్, పోలస అశోక్, కొండపలకల అభిలాష్ శర్మ, పారువెల్ల సంతోష్ శర్మ, గూడ రమేష్ శర్మలు భక్తులు, దంపతుల చే ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపించారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్లు పల్లా మురళీధర్, అల్లంకి సత్యనారాయణ, ఆకుల రామేశ్వర్ రెడ్డి, చకిలం మారుతి, మారవేణి లచ్చయ్య , పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ కొమురవెల్లి భాస్కర్, సాదుల సుగుణాకర్, సామల హరికృష్ణతో పాటు శ్రీ సాంబశివ దేవాలయం అర్చకులు రమేష్ శర్మ అసిస్టెంట్ బండి రామ్మోహన్ , భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే సుల్తానాబాద్ పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.