calender_icon.png 28 January, 2026 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై నిలదీయాలి

28-01-2026 12:48:14 AM

పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి జోగు రామన్న దిశానిర్దేశం

ఆదిలాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందించకపోవడంతో ప్రజలు ప్రజా సంక్షేమానికి దూరం అవుతున్నారని, బీఆర్‌ఎస్ పార్టీ అంటేనే ప్రజానీకానికి భరోసా అని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. మంగళవారం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి, మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు దిశా నిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ..  గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా  దశలవారీగా వార్డులలో సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ వార్డులలో అభివృద్ధిని విస్మరిస్తున్నారన్నారు. గత ప్రభుత్వ మంజూరు చేసిన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడంలో విఫలమైతున్నారు అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై గడపగడపకు నిలదీస్తూ ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాసం నర్సింగ్ రావు, మెట్టు ప్రహ్లాద్, యూనుస్ అక్బని, లింగారెడ్డి, దాసరి రమేష్, జహుర్ పాల్గొన్నారు.