calender_icon.png 12 January, 2026 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3 వేల కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

11-01-2026 12:57:52 AM

  1. మియాపూర్‌లో 15 ఎకరాలకు రక్షణ
  2. ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు

శేరిలింగంపల్లి, జనవరి 10 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శేరిలిం గంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని మక్తా మహబూబ్‌పేట సర్వే నంబరు 44లో కబ్జాలో ఉన్న రూ.3 వేల కోట్ల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిన హైడ్రా కాపాడింది. శనివారం భారీ బందోబస్తు అక్రమ షెడ్లను తొలగించిన అధికారులు ప్ర భుత్వ భూమి అని బోర్డులు పాతా రు. ఐటీ కారిడార్‌కు ఆనుకుని ఉన్న ఈ భూముల విలువ రూ.3 వేల కో ట్లకు పైగా ఉంటుందని అంచనా.

త ప్పుడు పత్రాలతో ఆ ప్రభుత్వ కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్టు హైడ్రా విచారణలో తేలింది. విచారణలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయన్న ఆరోపణలు, సంబంధిత సబ్రిజిస్ట్రార్ సస్పెన్షన్కు దారితీసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో హైడ్రా మరోసారి క్షేత్రస్థా యిలో విచారణ చేపట్టింది. ప్రజావాణికి గతంలో అందిన ఫిర్యాదుల ఆధారంగా ముందే ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా, మియాపూర్ బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్టపై అక్రమంగా ఏర్పాటు చేసిన 18 షెడ్లను అప్పుడే తొలగించింది.

తాజాగా చేపట్టిన విచారణలో సర్వే నంబర్ 159కు చెందిన భూమి పత్రాలను ఉపయోగించి, సర్వే నంబర్ 44లోని ప్రభు త్వ భూమిలో ఎకరన్నర వరకు కబ్జా చేసినట్టు గుర్తించి, సంబంధిత వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. సర్వే నంబర్ 44లోని 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. కబ్జాలకు తావు లేకుండా స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, ప్రభుత్వ భూమని స్పష్టంగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.

జలమండలి భూమిని కాపాడిన హైడ్రా

మేడ్చల్(విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి విలేజ్ సర్వే నంబరు 388లో జలమండలికి చెందిన 4.01 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. జలమండలి అవసరాల మేరకు ఇక్కడ భూమిని కేటాయించగా దానిని స్వాధీనం చేసుకోవడంలో స్థానికులు ఇబ్బందులు పెట్టారు. ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకుని ఆటంకాలు సృష్టించగా హైడ్రా సహాయాన్ని జలమండలి కోరింది. సంబంధిత శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి జలమండలికి ప్రభుత్వం కేటాయించినట్టు హైడ్రా నిర్ధారించుకుంది. శనివారం ఈ జలమండలికి చెందిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. జలమండలికి చెందిన భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది.