12-01-2026 09:05:39 PM
గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్
విజయక్రాంతి,పాపన్నపేట: గ్రంథాలయం విజ్ఞాన భాండాగారమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. మండలంలోని పొడిచన్ పల్లిలో సోమవారం ఎమ్మెల్యే రోహిత్ రావు చేతుల మీదుగా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం ద్వారా నిరుద్యోగులకు వివిధ రకాల పుస్తకాలను చదువుకొని జ్ఞానం పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని నిరుద్యోగులు, యువకులు బాగా చదువుకుని ఉద్యోగాలు సాధించాలని ఆయన యువతకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సర్పంచ్ ఎర్ర వెంకయ్య, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, నాయకులు కుమార్ గౌడ్, యాదయ్య, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.