calender_icon.png 24 January, 2026 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగోబాను దర్శించుకున్న మాజీ మంత్రి రామన్న

24-01-2026 12:00:00 AM

నాగోబాకు పట్టు వస్త్రాలు సమర్పించిన జాగృతి రాష్ట్ర నాయకులు

ఇంద్రవెల్లి, జనవరి 23 (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న దర్శిం చుకున్నారు. శుక్రవారం నాగోబా ఆలయానికి వచ్చిన మాజీ మంత్రికి మెస్రం వంశీ యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగోబాకు రామన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్యాహకులు రామన్న ను సత్కరించి నాగ దేవత చిత్ర పటాన్ని అందించారు. అనంతరం మెస్రం వంశీయులు కర్ర సాము, ప్రదర్శనను తిలకించారు.

అనంతరం మెస్రం వంశ ఉద్యోగు ల సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అదేవిధంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు నాగోబాను దర్శించుకున్నారు. జాగృతి రాష్ట్ర ఆదివాసీ అధ్యక్షులు లోకిని రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ, రాష్ట్ర నాయకులు సదానందం, బండారి లావణ్య, జిల్లా నాయకులు వేణుగోపాల్ యాదవ్, ఎర్రం సం తోష్‌లు దర్శించుకున్నారు. అనంతరం భక్తీ శ్రద్ధలతో నాగశేషుడికి పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.