calender_icon.png 24 January, 2026 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వసంత పంచమి వేడుకలు

24-01-2026 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి23 (విజయక్రాంతి): పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్లో వసంత పంచమి వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంబోజు తిరుపతి చారి ఆధ్వర్యంలో గణపతి పూజ, సంకల్పం, అగ్ని ప్రతిష్ఠాపన, సరస్వతీ మంత్ర ప్రయుక్త ఏకాదశ గాయత్రి యజ్ఞం, పూర్ణాహుతి, సరస్వతి అష్టోత్తర పూజలను నిర్వహించారు. వసంత పంచమి పర్వదినం సందర్భంగా అక్షరాభ్యాసాలకు విశేష ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో వందలాది మంది భక్తులు తమ చిన్నారులతో కలిసి ఉదయం నుంచే పాఠశాలకు చేరుకుని పూజల్లో పాల్గొని అక్షరాభ్యా సాలు చేయించారు.

అంతకుముందు వసం త పంచమి పురస్కరించుకుని ఆసిఫాబాద్ వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఉదయబాబు, కార్యదర్శి శ్రీనివాస్ చిన్నారులకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ గంధం శ్రీనివాస్, పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు చిలివేరి వెంకటేశ్వర్లు, క్లబ్ కోశాధికారి శ్రీధర్, మాజీ క్లబ్ అధ్యక్షుడు పాత శ్రీనివాస్, సభ్యులు కోడిప్యాక వేణుగోపాల్, రవీందర్, పాఠశాల ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు, సమితి కార్యదర్శి నాగుల శ్రీనివాస్, భోగ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.