calender_icon.png 25 January, 2026 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలి

24-01-2026 12:00:00 AM

కలెక్టర్ కే హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): 18 సంవత్సరాల వయసు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ వివరాలు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, ఆర్డిఓ అధికారి లోకేశ్వర్ రావు, డిఆర్డిఓ దత్తారావుతో కలిసి ఆమె పాల్గొని ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగ అధికారు లు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లాకు గుర్తింపు తెచ్చిన కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 23 (విజయ క్రాంతి): జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన వెంకటేష్ ధోత్రే జిల్లాను అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచడంతో పాటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు నీతి అయోగ్ లో జాతీయస్థాయి గుర్తింపు తీసుకువచ్చారని ప్రస్తుత జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో విద్యా శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పదోన్నతి పై వెళుతున్న వెంకటేష్ ధోత్రే వీడ్కోలు కార్యక్రమంలో జిల్లా ఎస్. పి. నితికా పంత్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, అదనపు ఎస్. పి. చిత్తరంజన్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి వెంకటేష్ ధోత్రే ను శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, జిల్లా అధికారులు, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఉద్యోగులు, అన్ని శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.