25-10-2025 04:28:15 PM
కోదాడ: మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామం రామాపురం క్రాస్ రోడ్డు లో నాగుల చవితి మహోత్సవాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి(పుట్ట) దేవాలయంలో నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ముళ్లపాడు శ్రీ సీతారామాంజనేయ భక్తబృందం వారిచే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, 5000 పైగాభక్తులకు అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు.
మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పుట్టలో పాలు పోసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. నిర్వాహకులు ఏర్పాటుచేసిన అందమైన కార్యక్రమంలో ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు. ఆదివారం నాగ పంచమి సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాల ధారణ స్వాములకు ప్రత్యేక రోజున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.