25-10-2025 04:26:05 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): శాంతి భద్రతల పరిరక్షణకు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెల కట్టలేనివని ఎస్ఐ ఈట సైదులు అన్నారు.పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహా ఆదేశాల మేరకు పోలీసు కళాబృందాలు శనివారం మండల కేంద్రం అర్వపల్లిలోని ప్రధాన చౌరస్తా వద్ద ప్రదర్శన,అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు కళాబృందం సభ్యులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను స్మరిస్తూ తమ పాటల ద్వారా అమరులైన పోలీసుల కథనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రవి, మహిళా హోంగార్డ్ రమణ,పోలీస్ కళాబృందం ఇంచార్జీ ఎల్లయ్య, గోపయ్య, సత్యం, చారి, గురులింగం, కృష్ణ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.