25-01-2026 07:17:16 PM
వాంకిడి,(విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధంమని, పాలకులను ఎన్నుకునే అవకా శం ఓటర్లకే ఉందని వాంకిడి తాసిల్దార్ కవిత అన్నారు. ఆదివారం తాసిల్దార్ కార్యా లయం ఆవరణలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉద్యోగులతో, కేజీబీవీ విద్యార్థులతో, ప్రజా ప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయడంతో పాటు ఎన్నికలు జరిగినప్పుడు విధిగా ఓటు హక్కును వినియోగించు కోవ డం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో వాంకిడి సర్పంచ్ సిహెచ్. సతీష్, ఉప సర్పంచ్ దీపక్ ముండే, తాసిల్దార్ కార్యాల యం సిబ్బంది, వాంకిడి ఎస్ఐ మహేందర్, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థు లు తదితరులు పాల్గొన్నారు.