08-10-2025 05:52:47 PM
రాజకీయ భాషను అలవర్చుకోవాలి..
రేగొండ మండల బీఆర్ఎస్ నాయకులు.
రేగొండ (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజాదరణ చూడలేకనే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు హింగె మహేందర్ విమర్శించారు. మండల కేంద్రంలో బుదవారం బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు కోలేపాక భిక్షపతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హింగే మహేందర్ మాట్లాడుతూ రేగొండ మండల కాంగ్రెస్ నాయకులు రాజకీయ భాషను అలవర్చుకోవాలని అన్నారు. బుగులోని జాతరలో ఆలయానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి నిధులు మంజూరు చేయగా అటవీ అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదన్నారు.
జిల్లా కేంద్రంలో ఆసుపత్రి నిర్మించి చికిత్స కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా సొంత ఖర్చుతో ఉచిత భోజనం సమకూర్చిన గొప్ప మనసు కలిగిన రమణారెడ్డిని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. మా నాయకుడు మాకు సంస్కారం నేర్పించారు కాబట్టి మీలాగా ఏకవచనంతో సంబోదించలేకపోతున్నామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని అన్నారు. రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని గండ్ర వెంకట రమణారెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాపిరెడ్డి, బీఆర్ఎస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఏనుగు లింగారెడ్డి, నాయకులు పసుల రత్నాకర్, తడక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.