calender_icon.png 8 October, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్.ఎస్.ఎస్. జాతీయ అవార్డ్ గ్రహీతకు అభినందనలు

08-10-2025 05:49:45 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): జాతీయ సేవా పథకంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నమిలగుండు పల్లె గ్రామస్థుడైన వంగపల్లి మణి సాయివర్మ విద్యార్థి వాలంటీర్ గా విశేష సేవలను గుర్తిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్ గా అవార్డును స్వీకరించిన సందర్భంగా తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర శాఖ కోశాధికారి నామీలకొండ ప్రభాకర్ అభినందనలు వ్యక్తం చేశారు. తెలంగాణ కుమ్మర సంఘం కరీంనగర్ జిల్లా కార్యాలయంలో నామీలకొండ ప్రభాకర్ రాష్ట్ర కోశాధికారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మణి సాయివ ర్మను స్పూర్తిగా తీసుకుని కుమ్మర సామాజిక వర్గం యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తదుపరి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మణి సాయివర్మ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో నిరంతరం కృషి చేసిన మణి సాయివర్మ కుమ్మర సామాజికవర్గానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం హర్షణీయమని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నాంపల్లి శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గొట్టం ధరణీధర్, సంఘ్ బాధ్యులు నాంపల్లి రవీందర్, రమేష్, తిరుపతి పాల్గొన్నారు.