08-10-2025 05:58:35 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన సెల్ ఫోన్లతో పాటు పోగొట్టుకున్న సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని బుధవారం బాధితులకు అందజేశారు. ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఈ ఫోన్లను గుర్తించి మొత్తం 72 మందికి ఫోన్లను అందించినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. విలువైన ఫోన్లు చోరీకి గురైన పోయిన వెంటనే ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ఉపేందర్ రెడ్డి ఐటీ కోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.