calender_icon.png 10 September, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మార్ట్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి..

10-09-2025 07:48:34 PM

తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ పట్టణ కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా నూతనంగా స్మార్ట్ షాపింగ్ మాల్ బట్టల షో రూంను కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Former MLA Mynampally Hanumanth Rao) ముఖ్యఅతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్మార్ట్ షాపింగ్ మాల్ యాజమాని వారికి పూలతో ఘన స్వాగతం పలికారు. వీరితో పాటు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా నాయకులు చిటుకుల మహిపాల్ రెడ్డి, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా స్మార్ట్ షాపింగ్ మాల్ యాజమాని సయ్యద్ జమీల్ మైనంపల్లి హనుమంత రావును పూల బొకేలను అందించి ఘనంగా శాలువాతో సన్మానించారు. ముందుగా మనోహరాబాద్ మండల కేంద్రంలో ఉన్న శ్రీ బంగారమ్మ దేవాలయంలో వారు పూజారుల చేత ప్రత్యేక పూజ కార్య క్రమాన్ని నిర్వహించారు.