10-09-2025 07:46:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా నిర్మల్ జిల్లాకు చెందిన బండారు లావణ్య నియమితులయ్యారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో మహిళలను జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆమె అనేక ఉద్యమాల్లో పాల్గొనడంతో ఈ పదవి ద్వారా గుర్తింపు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతామని రాష్ట్ర కార్యదర్శి బి లావణ్య తెలిపారు.