calender_icon.png 10 September, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొజెక్టర్ ను సద్వినియోగం చేసుకోవాలి

10-09-2025 07:52:39 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు ప్రొజెక్టర్ ను సద్వినియోగం చేసుకొని ఏకాగ్రతతో చదువుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ లతో కలిసి సందర్శించి సరస్వతి దేవి చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థ వారు గత సంవత్సరం మొబైల్ సైన్స్ ల్యాబ్ వాహనాన్ని అందజేశారని, ఈ సంవత్సరం జిల్లాలోని 10 మండలాలలో ఒక్కొక్క పాఠశాలకు ప్రొజెక్టర్ లను అందజేశారని తెలిపారు.

ఈ ప్రొజెక్టర్ ద్వారా అందించే విద్యా బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాలలలో చదువు పూర్తి చేసుకుని బయటికి వెళ్లిన తరువాత జ్ఞానాన్ని పొందాలని తెలిపారు. కేవలం ఉత్తీర్ణుల అయినంత మాత్రాన సరిపోదని, సమాజం, సాంకేతిక రంగం వైపు అడుగు వేయాలని తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో మంచి అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని అన్నారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ప్రతినిధు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.