19-10-2025 08:33:09 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని మాందాపురం గ్రామానికి చెందిన సోలిపురం ఉపేందర్ రెడ్డి మాతృమూర్తి సోలిపురం కౌసల్య ఇటీవల మృతిచెందారు. కాగా వారి కుటుంబాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.