calender_icon.png 19 October, 2025 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గంధం ఉర్సు ఉత్సవాలు

19-10-2025 08:35:34 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని డైలీ మార్కెట్ ప్రాంతంలో ఉన్న పవిత్ర దర్గా వద్ద ఆదివారం ఘనంగా గంధం ఉర్సు ఉత్సవాలను నిర్వహించారు. ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ముస్లిం భక్తులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉర్సు సందర్భంగా దర్గా పరిసరాలు ప్రత్యేకంగా అలంకరించగా, భక్తులు అల్లాహ్ తాలా దయకోసం ప్రార్థనలు చేశారు. ఆయా కార్యక్రమాల అనంతరం కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది. భక్తులకు, స్థానిక ప్రజలకు ఆహారం పంచిపెట్టడం ద్వారా మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది.

ఈ సందర్భంగా ముస్లిం వెల్ఫేర్ కమ్యూనిటీ అధ్యక్షుడు షేక్ గయాజోద్దీన్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గంధం ఉర్సు కార్యక్రమాన్ని సమగ్రంగా నిర్వహించడం తమ సమాజ సేవలో భాగమని, ఈ కార్యక్రమం ద్వారా మత సామరస్యాన్ని, స్నేహభావాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షుడు ముక్రం అలీ, అజీదుర్ రహమాన్, క్యాషియర్ షేక్ హైమద్, జాయింట్ సెక్రటరీ ఏంది హైమద్ పాష, ఆభీద్ జానీ, మదర్సా అధ్యక్షుడు ఏజాద్ హైమద్ మన్సూరి, సభ్యులు షేక్ నయీమ్, మజీద్, ఎండి రహీం, మస్కుద్ అలీ, సయ్యద్ నజీబ్ ఉల్లా, సద్దాం అలీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.