calender_icon.png 17 November, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలు రిజర్వేషన్ నిర్ణయిస్తే ఎలా?

17-11-2025 12:00:00 AM

చట్ట ప్రకారం 42 శాతం రిజర్వేషన్ చేయాలి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి 

జడ్చర్ల, నవంబర్ 16: పార్టీలో రిజర్వేషన్ చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తే ఎలా సరిపోతుందని చట్ట ప్రకారం 42% రిజర్వేషన్ చేసి ఎన్నికలు నిర్వహించాలని మాజీమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ అంబేద్కర్ చౌరస్తాలో బీసీ జెఏసి,బీసీ జాగృతి సేన, బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్ట బద్ధతతో కూడిన 42% రిజర్వేషన్ల సాధనకై సంతకాల సేకరణ కార్యక్రమానికి మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి మద్దతు తెలియజేస్తూబీసీ రిజర్వేషన్ల సాధనకు సంతకం చేశారు.

రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలపై పై ఒత్తిడి తీసుకువచ్చే 42 శాతం రిజర్వేషన్ అమలు జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సగర సంగం జిల్లా అధ్యక్షులు ప్రనిల్ చందర్, తదితరులు ఉన్నారు.