06-12-2024 01:17:07 AM
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): సచివాలయంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను గురువారం సీఎం పరిశీలించి ఆరా తీశారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన ఇంటికి వెళ్లి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానిస్తారని సీఎం తెలిపారు.
విగ్రహ ఆవిష్కరణతో పాటు ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా భారీ డ్రోన్, లేజర్, క్రాకర్స్ షోలు నిర్వహించను న్నారు. ఏడో తేదీన వందేమాతరం శ్రీనివాస్, 8న రాహుల్ సిప్లీగంజ్, 9న థామస్‌తో సినీ సంగీత కార్యక్రమాలు జరగనున్నాయి.
9న తెలుగుతల్లి ప్లుఓవర్ నుంచి పీవీ మార్గ్ వరకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి వివిధ కళారూపాలను ప్రదర్శించనున్నారు. ఫుడ్, హ్యాండీక్రాప్ట్స్ సహా వివిధ శాఖలకు చెందిన 120 స్టాళ్లు, యూత్ కోసం సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు.