calender_icon.png 28 October, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి బెదిరిస్తుండు

28-10-2025 01:35:22 AM

చర్యలు తీసుకోవాలని మేడ్చల్ కలెక్టరేట్ వద్ద బాధితుల ధర్నా 

మేడ్చల్, అక్టోబర్  (విజయక్రాంతి): చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, మరో ముగ్గురు భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని, బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ కలెక్టరేట్ వద్ద సోమవారం బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ధర్నాకు సీపీఐ మద్దతు తెలిపింది. షామీర్‌పేట్ మండలం బొమ్మరాసిపేట్ శివారులోని లియోనియో రిసార ట్స్‌ను గడ్డం రంజిత్ రెడ్డి, రామరాజు, ప్రవీ ణ్ రావ్, తిరుపతి రెడ్డి కొనుగోలు చేసి ఆక్రమణ, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు.

తమ భవనాన్ని ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేశారని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడంలేదని కపిల్‌శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనపైనే పోలీసులు కేసు నమోదు చేశారని వాపోయాడు. సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి సాయిల్ గౌడ్ ధర్నాలో మాట్లాడుతూ పోలీసులపై రంజిత్ రెడ్డి ఒత్తిడి చేస్తు న్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బాధితులు ఎం పీ ఈటల రాజేందర్‌ను కలిసి సమస్యను విన్నవించారు. రిసార్టులోకి నీళ్ల కోసం అక్రమంగా కలెక్టర్ ఆఫీసు ముందు నుంచి సుమారు మూడు కిలోమీటర్లు పైపులైన్ వేశారని, అక్రమంగా నీరు వాడుకుంటున్నారని ఆరోపించారు. రోడ్లు బంద్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుందని వివరించారు. పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీ ఈటల హామీ ఇచ్చారు.