calender_icon.png 28 October, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్రమత్తంగా ఉండండి

28-10-2025 01:25:28 AM

  1. పంటల కొనుగోళ్లు సజావుగా సాగాలి 
  2. మొంథా తుఫాను నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు 
  3. రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి 
  4. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్, తుమ్మల సమీక్ష 

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): మొంథా తుఫానుతో తెలంగా ణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావర కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం లో రాష్ర్ట అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ర్టంలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు నష్టం జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని అదేశించారు.

కాగా,  బంగాళాఖాతం నుంచి ముంచుకొస్తున్న మొంథా తుఫాన్ కారణంగా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములు గు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండతో పాటు మిగిలి నజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ జారీ చేసింది.

రైతులు నష్టపోవద్దు: మంత్రి ఉత్తమ్

మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ర్టం లో కురిసే వానలతో ధాన్యంతో పాటు మొక్కజొన్న పంటలు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్తలకు రాష్ర్ట ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా సోమవారం సాయంత్రం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడు తూ..  మొంథా తుఫాన్ పట్ల అప్రమత్తం గా ఉండాలని, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద తుఫాన్ ప్రభావం పడకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగం నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న టార్ఫాలిన్లను వినియోగించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యాం పాడవకుండా చూడాలని సూచించారు.

కొన్న ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చెయ్యాలని, అందుకు  అవసరమైన రవాణా వసతి ఏర్పాటు, 30 నుంచి 45 రోజుల వరకు ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం సమిష్టిగా పని చేయాలని ఆదేశించారు. రాష్ర్ట వ్యాప్తంగా 8,342 ధాన్యం కొను గోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటి వరకు 4,428 కొనుగోలు కేంద్రా లు ప్రారంభమయ్యాయని చెప్పారు.

మిగిలిన 3,814 కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు 22,433 మంది రైతుల నుంచి ప్రభుత్వం 1,80,452 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని, అందులో దొడ్డు రకం 73,628 మెట్రిక్ టన్నులు, సన్నాలు 1,06,824 మెట్రిక్ టన్నులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం విలువ 431.09 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రా లపై నిరంతర పర్యవేక్షణ జరపాలని, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులు సందర్శించి అక్కడి పరిస్థితులను ఎప్పటి కప్పుడు పరిశీలించాలన్నారు. అవినీతి జరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.