28-10-2025 01:20:58 AM
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం
రాష్ట్రంలో రెండు పార్టీల పాలనపై నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిప క్ష బీఆర్‌ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా? అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావుకు సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ చేశా రు. బలహీన వర్గాల మంత్రులున్న కేబినెట్‌ను దండుపాళ్యం బ్యాచ్ అని ఎలా అం టారు అని హరీశ్‌రావును నిలదీశారు.
మా కేబినెట్ దండుపాళ్యం బ్యాచ్ అయితే, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని మంత్రివర్గం స్టూ వర్టుపురం దొంగల ముఠా అని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలున్న కేబినెట్‌పై చేసి న అనుచిత వ్యాఖ్యలకు హరీశ్‌రావు తక్షణ మే క్షమాపణలు చెప్పాలని అడ్లూరి డిమాం డ్ చేశారు. కాగా మంత్రి అడ్లూరి చేసిన సవాల్‌పై చర్చించేందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు నెక్లెస్ రోడ్డులోని 125 విగ్రహాల అంబేద్కర్ విగ్ర హం వద్ద వచ్చారు.
వీరిని పోలీసులు అడ్డుకోవడంతో కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మె ల్యే కోరుకంటి చందర్, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కొప్పులతోపాటు మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అదులోపుకి తీసుకుని సైఫాబాద్ పీఎస్‌కు తరలించారు.
చర్చకు రమ్మంటే తప్పించుకుంటారా?: అడ్లూరి
మంత్రుల నివాసంలో ఎమ్మెల్యేలు మే ముల వీరేశం, మందుల సామేల్, కవ్వంపల్లి సత్యనారాయణ, నాగరాజు, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి మంత్రి అడ్లూరి సోమవారం మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావును చర్చకు రమ్మంటే రా కుండా తప్పించుకోవడమేమిటని ప్రశ్నించారు. ఇటీవలే సిద్దిపేటలోని దేవాలయానికి రమ్మంటే రాలేదని, ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం వద్దకు కూడా రాకుండా ఇతరులను పంపడం చూస్తే తోకముడిచి పారిపో యారా అని ఎద్దేవా చేశారు.
“హరీశ్‌రావు కాంగ్రెస్ కేబినెట్‌ను దండుపాళ్యం బ్యాచ్ అని పిలవడం సిగ్గు చేటు. మీరు పదేళ్లు రా ష్ట్రాన్ని దోచుకున్న స్టూవర్టుపురం దొంగలకు మించిన బంధిపోట్లు. మీరే దండుపాళ్యం ముఠా సభ్యులు. పదేళ్లు మంత్రిగా ఉండి దండుపాళ్యం బ్యాచ్‌ను నడిపించింది నీవు, నీ బామ్మర్ది, మీ మామ కేసీఆర్. సిద్దిపేట దేవాలయంలో చర్చకు సవాల్ విసిరినప్పు డు రానని తోక ముడిచావు. ధైర్యం ఉంటే, మళ్లీ రా.. ప్రజల ముందే చర్చిద్దాం.
దళితుల మీద తుపాకులు పెట్టి బెదిరించిన రోజులు గుర్తున్నాయా హరీశ్‌రావు? ఇక తెలంగాణ ప్రజలు భయపడే రోజులు లేవు. మేము నీ మాదిరిగా వెన్నుపోటు రాజకీయాలు చే యం. 28 మంది ఎమ్మెల్యేలకు గత ఎన్నికలో డబ్బులు పంచారని కవిత చెప్పిన విష యం వాస్తవం కాదా? కేబినెట్ విషయాలు వ్యక్తిగత దురుద్దేశాలతో బయటపెడుతున్నా వు. మీరు పదేళ్లు మేమే రాజులం, మేమే మంత్రులం అంటూ పాలించారు.
ఇప్పుడు ప్రజలు మీకు తీర్పు ఇచ్చినా ఇంకా రాజుల్లాగానే ఫీల్ అవుతున్నారు. కానీ ప్రజలు డిసెంబర్ 2023లోనే మిమ్మల్ని భూస్థాపితం చేశారు. ఇక నీ పార్టీని బతికించుకోడం నీ అయ్య తరం కూడా కాదు. కాలేశ్వరం అవినీతి, అసైన్డ్ భూముల కబ్జా, లిక్కర్ దందాలన్ని దండుపాళ్యం కంటే ఘోరమైన దోపిడీలు. కవిత తీహార్ జైలుకు ఎందుకు వెళ్లిందో ప్రజలందరికి తెలుసు.
మీరు దోచుకున్నదంతా న్యాయస్థానం ముందు బయ టపడుతుంది” అని మంత్రి అడ్లూరి హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా పాలన అందిస్తున్నారని మంత్రి అడ్లూరి చెప్పారు. “కేసీఆర్ హయాంలో అధికారం దుర్వినియోగం ఉండేది. మా కేబినెట్‌లో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంది. మీరు ప్రగతిభవన్ గేట్ల దగ్గరే మంత్రులను నిలిపేశారు. అప్పటి హోంశాఖ మంత్రినే గేటు వద్ద నిలిపివేశారు. మీ యాసతో అబద్ధాలకే శక్తి తెస్తున్నారు.
కానీ ఇప్పుడు ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. మేము ఆరు గ్యారం టీలలో నాలుగు అమలు చేశాం. మిగతా వాటిని కూడా అమ లు చేస్తాం. మీరు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినా మేం అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను సమానంగా చూసే ప్రభుత్వం మాది. సీఎంపైన, క్యాబినెట్‌పైన చేసిన వ్యాఖ్యలకు హరీశ్‌రావు బహిరంగం గా క్షమాపణ చెప్పాలి” అని మంత్రి అడ్లూరి డిమాండ్ చేశారు.
నిజాయతీ లేకనే చర్చకు రాలేదా?: కొప్పుల
కాంగ్రెస్ నేతల వద్ద నిజాయతీ ఉంటే వారు చేసిన సవాల్‌కు బీఆర్‌ఎస్ తరఫున ఎవరు వచ్చినా చర్చకు వచ్చేవారని, వారికి నిజాయతీ లేదుకాబట్టే చర్చకు రాలేదని మాజీ మం త్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. చర్చకు వచ్చిన తమను పోలీసులను పెట్టి అడ్డుకున్నారంటేనే వారి పాలన ఏపాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. 22 నెలల్లోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.
ప్రభుత్వ ఆ స్పత్రుల్లో మందులు కూడా లేవని, గురుకులాల్లో విద్యార్థులకు పట్టెడన్నం పరిస్థితి నెలకొన్నదని, విద్యా ర్థులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు యూరియా ఇవ్వలేని ప్రభుత్వం కాంగ్రెస్ అని విమ ర్శించారు. అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్‌ది అట్టర్‌ప్లాఫ్ ప్రభుత్వమని అన్నా రు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై అశోక్‌నగర్ చౌరస్తాకు వచ్చి మాట్లాడాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గు రించి ప్రజలు తిట్టుకుంటున్నా తెలుసుకోలేని నేతలు ఆ పార్టీలో ఉన్నార ని మండిపడ్డారు. క్యాబినేట్ మీటింగ్‌లో ప్రజాసమస్యలు, రాష్ట్ర అభివృ ద్ధి గురించి చర్చించకుండా మంత్రు ల అవినీతి పంపకాల గురించి చర్చించారని ఆరోపించారు. హైడ్రా పేరున పేదల ఇళ్లు కూల్చుతున్నారని, హైదరాబాద్‌లో అభివృద్ధి ఎక్క డికక్కడే ఆగిపోయిందన్నారు. మూ సీలో కృత్రిమ వరద సృ ష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశార ని ఆరోపించారు.