calender_icon.png 28 October, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ అంటేనే పట్టుదల ఓర్పు సహనం

28-10-2025 01:34:19 AM

పోలీస్ అమరవీరుల స్మారక ఉత్సవంలో  సైకిల్ ర్యాలీ 

ఉప్పల్, అక్టోబర్ (విజయక్రాంతి): పోలీస్ అంటేనే పట్టుదల ఓర్పు సహనం అని  శాంతి పద్ధతులను కాపాడేందుకు వారు చేసే కృషి మరువలేదని కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి అన్నారు. పోలీస్ అమరవీల సంస్కరణ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం ఏసీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కుషాయిగూడ పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ఈసీఐఎల్ నుంచి ప్రారంభమై సైకిల్ ర్యాలీ ఏఎస్‌రా వునగర్ సిగ్నల్ వరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ వెంకట్‌రెడ్డి మాట్లాడు తూ.. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనని విధి నిర్వహణలో అమరులైన పోలీస్ శాఖలు మనకు స్ఫూర్తి అన్నారు. పగలు రాత్రి లేకుండా సమాజంలో శాంతిభద్రతలు కాపాడుతూ  అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని కొనియాడారు. తీవ్రవాదం ఉగ్రవాదం మతత్వం ధోరణిలో సంఘ విద్రోహ శక్తులు హింసలను పాల్పడుతున్నాయని ఇలాంటి శక్తులను ఎదుర్కొంటూ ఎందరో పోలీస్ సోదరులు వీరమరణం పొందారన్నారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఎస్‌హెచ్‌ఓ భాస్కర్ రెడ్డి, ఎస్సైలు సుధాకర్ రెడ్డి, వెంకన్న, సతీష్, విజయ్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.