calender_icon.png 28 August, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవగతం అయ్యేలా బోధించండి

28-08-2025 04:32:30 PM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

మిడ్జిల్: విద్యార్థులకు అవగతం అయ్యేలా బోధించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి(District Collector Viziendira Boyi) అన్నారు. గురువారం మండల స్థాయి ప్రాథమిక పాఠశాలల బోధన అభ్యాసన సామాగ్రి మేళాను గురువారం మండల కేంద్రంలోని టీఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి తయారుచేసిన బోధన సామాగ్రిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా హాజరైన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ... బోధన సామాగ్రితం బోధించడం వల్ల బోధన సులభం అవుతుందని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే పద్ధతిలో బోధించవచ్చని ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా బోధన సామాగ్రిని వినియోగించి బోధనలు సమర్థవంతంగా బోధించాలని వారు సూచించారు. విద్యార్థులకు రాబోయే భావితరానికి విద్య అందించడం చాలా అవసరమని మనము విద్యార్థులకు విద్యను అందించినట్లయితే వారు భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అందుకుంటారన్నారు.

విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని తెలిపారు.  అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించి వంట మనుషుల అనుభవం భోజనం నేను వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని అన్నారు.  పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదేవిధంగా ప్రాథమిక సహకార కేంద్రాన్ని తనిఖీ చేశారు, రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తామని  యూరియా వాడకం తగ్గించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య, తహసిల్దార్ పులి రాజు, ఎంపీడీవో గీతాంజలి, పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఏవో సిద్ధార్థ,పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు