28-08-2025 04:24:46 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు(MLA Thota Laxmi Kantha Rao) ఆదేశాల మేరకు ముప్పు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలు సిరిపూర్‌కు చెందిన ముప్పు ప్రాంతాల నుండి ప్రజలను తరలింపు కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో సుమారు పెద్ద శకర్గ గ్రామంలో 40 మందిని సురక్షితంగా ఉన్నారు. మిర్జాపూర్‌లోని 60 మందిని వసతి కల్పించారు. తరలించిన ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ, వారికి టిఫిన్‌లను మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ చర్యతో ముప్పు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయాందోళనల నుండి బయటపడి సురక్షిత వాతావరణంలో ఆశ్రయం పొందారు. "ప్రజలు ఈ సందర్భంలో ఎమ్మెల్యేకు నిర్వాహకులకు ఆలయ చైర్మన్ రామ్ పటేల్ చౌలవర్ హనుమాన్లు స్వామి చేసిన కృషికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. భారీ వర్షాల కారణంగా సిర్పూర్, టాక్లీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే ప్రస్తుతం అర్ధరాత్రి నుంచి వరద పర్య వేక్షణ చేస్తున్నారు.