28-08-2025 04:28:56 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కొడుతున్న భారీ వర్షానికి మండలంలోని వివిధ గ్రామాల్లో 3924 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేసినట్లు మండల వ్యవసాయ అధికారి ప్రజాప్రతి(Mandal Agriculture Officer Prajapati) తెలిపారు. పత్తి 1028, మొక్కజొన్న 1454, వరి 1125, సోయా 317 ఎకరాల్లో పంట నీట మునిగినట్టు తెలిపారు. 2754 మంది రైతుల పంట నష్టం జరిగినట్టు అంచనా వేశారు.